అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో వికృత పాలన నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) ఆరోపించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi)కి బహిరంగ లేఖ రాశారు. రాహుల్‌గాంధీ సిద్ధాంతాలను రేవంత్ తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.
బుల్డోజర్ రాజ్‌ను కాంగ్రెస్ విమర్శించిందని.. కానీ తెలంగాణలో కూల్చివేతలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. హెచ్‌సీయూ విద్యార్థులపై పోలీసులు దాడి చేసినా రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు.