అక్షరటుడే, ఇందల్వాయి/కామారెడ్డి: Rain Effect | ఉమ్మడిజిల్లాలో ఒక్కసారిగా వాతావరణం(Weather) చల్లబడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కాగా పలుచోట్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి(Indalwai) మండలంలో అకాల వర్షం కారణంగా ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టగా తడిసి ముద్దయ్యింది.
మరికొన్ని చోట్ల కోతకు వచ్చిన వరిపంట(Rice crop) నేలవాలింది. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి సిర్నాపల్లి గన్నారం చంద్రాయన్ పల్లి తదితర గ్రామాల్లో భారీ వర్షానికి రైతు(Farmers)లు తీవ్రంగా నష్టపోయారు. అలాగే కామారెడ్డి(Kamareddy) జిల్లాలోని పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది.