అక్షరటుడే, వెబ్ డెస్క్: కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో మరోమారు వడగళ్ల వాన భీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం సోమార్ పేట్ తండా, బంజేపల్లి, నిజామాబాద్ రూరల్ పరిధిలోని గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. గాలివానకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈదురు గాలులకు ఇంటి పైకప్పులు లేచిపోయాయి. వర్షానికి పంటలు నేలవాలగా.. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కొద్ది రోజుల కిందట కురిసిన వర్షానికి ఉమ్మడి జిల్లాలో పెద్దమొత్తంలో పంట నష్టం వాటిల్లింది. మరోమారు అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేశాయి.