అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంతో పాటు మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. బోర్లం, తాడ్కోల్, బుడిమి, కొత్తబాది తదితర గ్రామాల్లో వీచిన ఈదురు గాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా బలమైన ఈదురు గాలి వేయడంతో పలు నివాసపు గుడిసెలు కూలిపోయాయి. ఇళ్ల పైకప్పులు, రేకుల షెడ్లు లేచిపోయాయి. భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. బోర్లం గ్రామంలో విద్యుత్తు స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి. విద్యుత్తు అధికారులు సరఫరా నిలిపివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Advertisement
Advertisement