అకాల వర్షం..జిల్లాలో తీరని నష్టం!

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: అకాల వర్షం రైతన్నలకు తీరని నష్టం చేకూర్చింది. శనివారం సాయంత్రం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కురిసిన వడగళ్ల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల వరి పంట వాలిపోయింది. వరి గింజలు నేలరాలాయి. అలాగే మామిడి కాయలు రాలిపోయాయి. నువ్వు పంట కూడా దెబ్బతింది. దీంతో ఆదివారం బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీఇచ్చారు. అలాగే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీర్కూరు మండలం కిష్టాపూర్‌, అన్నారం, చించోలి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.