RMP PMP | రాష్ట్రంలో నకిలీ ఆర్ఎంపీలపై కేసలు.. చిట్టా ఇదే..!

రాష్ట్రంలో ఆర్ఎంపీలపై ఆగని కేసుల పరంపర
రాష్ట్రంలో ఆర్ఎంపీలపై ఆగని కేసుల పరంపర
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: RMP PMP : రాష్ట్రంలో మరో 12 మంది ఆర్ఎంపీలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కేసులు నమోదు చేసింది. పరిధికి మించి వైద్యం చేస్తున్నట్టుగా గుర్తించిన అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ ప్రాంతంలో 8 మంది, సంగారెడ్డిలో ముగ్గురు, కామారెడ్డి జిల్లా బాన్సవాడలో ఒకరు నకిలీ వైద్యులను గుర్తించారు. దుండిగల్​లోనూ నకిలీ వైద్యులను గుర్తించారు.

RMP PMP : ఇప్పటి వరకు 400 మందికి పైగా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నకిలీ వైద్యులపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 400 మందికి పైగా ఆర్ఎంపీలపై కేసులు నమోదయ్యాయి. అయినా కూడా తమ తీరు మార్చుకోకుండా పరిధికి మించి వైద్యం చేస్తూ పేద, అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

RMP PMP : పలు సెక్షన్లపై…

గత కొన్ని నెలలుగా నకిలీ వైద్యుల విషయంలో తరచూ తనిఖీలు చేసి, కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు.. గత నెలలో దుండిగల్, బాచుపల్లి, సంగారెడ్డి, వనస్థలిపురం, బాన్సువాడలో తనిఖీలు చేపట్టింది. పరిధి దాటి వైద్యం చేస్తున్నట్లు గుర్తించిన వారిపై ఎన్ఎంసీ చట్టం 34, 54, టిఎస్ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు టీజీఎంసీ వైస్ ఛైర్మన్ డా జి.శ్రీనివాస్ తెలిపారు.

RMP PMP : కేసులు నమోదు చేయబడిన ఆర్ఎంపీల వివరాలు :

దుండిగల్ పోలీస్ స్టేషన్ :

1 . సాత్విక్ క్లినిక్ – జె. జితేందర్
2 . శ్వేతా క్లినిక్ – శేఖర్
౩. సహజ హాస్పిటల్ – జి.శ్రీనివాస్ BAMS డాక్టర్ అల్లోపతిక్ ప్రాక్టీస్ చేస్తుంన్నందుకు నోటీసు జారీచేయడం జరిగింది.

బాచుపల్లి పీఎస్ పరిధి :

1. బుచ్చి బాబు క్లినిక్ – కే అరుణ కుమారి.
2. యాష్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ – చంద్ర ఓబుల్ రెడ్డి.

సంగారెడ్డి పీఎస్ పరిధి :

1. శ్రీనివాస్ క్లినిక్ – పి .కిషన్ రావు
2 . దస్తగిరి క్లినిక్ – జి.దస్తగిరి
3 .మణికంఠ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ -డి .మల్కా గౌడ్

వనస్థలిపురం పీఎస్​ పరిధి:

1. స్మార్ట్ క్యూర్ సెంటర్ – జి.చంద్రకళ
2 . వాసు మెడికల్ అండ్ జనరల్ స్టోర్ అండ్ క్లినిక్ – సి.శ్రీనివాస్
౩. ఆయ్నష్ డయాగ్నోస్టిక్ సెంటర్ – పి. మహేష్
4 . రాజర్షి ఇంఫార్మరి – జి.చంద్ర శేఖర్

బాన్సువాడ, కామారెడ్డి జిల్లా

1 ధన్వంతరి క్లినిక్ – శివకుమార్ – కంటి టెక్నీషియన్ అయివుండి, కంటి డాక్టర్​గా చలామణి అవుతున్నందుకు FIR నమోదు అయింది.

RMP PMP : నిబంధనలకు విరుద్ధంగా చికిత్సలు

చాలా వరకు ఆర్ఎంపీలు ఎటువంటి విద్యార్హత లేకుండా MBBS డాక్టర్ల వలే వారి పరిధి దాటి అశాస్త్రీయంగా, ఇష్టారీతిన యాంటిబయోటిక్స్, స్టెరాయిడ్స్, నొప్పి నివారణ ఇంజెక్షన్స్ ఇవ్వడం వలన ప్రజారోగ్యానికి పెను ముప్పు పొంచి ఉందని టీజీఎంసీ వైస్ ఛైర్మన్ డా జి.శ్రీనివాస్ తెలిపారు. ఇలాంటి వారిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

RMP PMP : తప్పులు పునరావృతం చేస్తే..

ప్రజారోగ్యాన్ని పరిరక్షించి గ్రామాల్లో హెల్త్ సెంటర్స్ ని బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని టీజీఎంసీ వైస్ ఛైర్మన్ డా జి.శ్రీనివాస్ సూచించారు. ఆయుర్వేదం చదివి నిబంధనలకు విరుద్ధంగా చికిత్సలు చేస్తున్న సహజ క్లీనిక్​ నిర్వాహకుడు శ్రీనివాస్ కుమార్​కు నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు తగు చర్యలు తీసుకోవాలని ఆయుష్ కౌన్సిల్ కి లేఖ పంపారు. తప్పులు పునరావృతం చేస్తే FIR నమోదు చేస్తామని తెలంగాణ వైద్యమండలి ఛైర్మన్​ డా. కె. మహేష్ కుమార్ స్పష్టం చేశారు.

Advertisement