అక్షరటుడే, కామారెడ్డి : Farmers | పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని losses to farmers మిగిల్చాయి. గురువారం కురిసిన గాలివానతో పంటలు దెబ్బతిన్నాయి. వారం, పది రోజుల్లో కోతకొచ్చే పైర్లు నేలవాలాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఎన్నో ఆశలతో యాసంగి పంటలు Yasangi crops సాగు చేసిన అన్నదాతలకు ఆది నుంచి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులు Farmers ఈ సీజన్లో తీవ్రంగా నష్టపోయారు. సాగు చేసిన నాటి నుంచి తెగుళ్ల బెడద, సాగునీటి కష్టాలతో ఇబ్బందులు పడి పంటను కాపాడుకుంటే.. తీరా కోత దశలో అకాల వర్షాలు తమకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయని రైతులు వాపోతున్నారు.
Farmers | వెంటాడుతున్న వానలు
కామారెడ్డి జిల్లాలో Kamareddy district ఎక్కువ విస్తీర్ణంలో రైతులు వరిసాగు paddy చేశారు. ప్రస్తుతం వరికోతలు ప్రారంభమయ్యాయి. వరి కోసిన రైతులు ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు purchasing centers తరలిస్తున్నారు. ఈ సమయంలో వర్షాలు పడుతుండటంతో వరి పంటకు తీవ్ర నష్టం కలుగుతోంది. గాలివానకు వరిపైరు నేలవాలడంతో పాటు వడ్లు రాలిపోతున్నాయి. మరోవైపు ఆరబెట్టిన ధాన్యం సైతం వర్షానికి తడిసిపోతోంది. ఉదయం ఎండబోయగానే మధ్యాహానికి మేఘాలు రావడంతో వర్షం భయంతో కుప్పలు చేస్తున్నారు.
Farmers | వందల ఎకరాల్లో నష్టం
జిల్లాలో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత నెలలో కురిసిన వర్షానికి సుమారు 300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. గురువారం కురిసిన వర్షానికి మరో 450 ఎకరాల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.
Farmers | ఈ మండలాల్లోనే ఎక్కువ
జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో వడగళ్ల వాన పడింది. మాచారెడ్డి మండలంలో గాలివాన కురిసింది. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో 65 ఎకరాలు, పత్లాపూర్లో 150, హస్గుల్లో 60, రాజుల్లాలో 10, దౌల్తాపూర్లో 20, బిచ్కుందలో 35 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. జుక్కల్ మండలం ఖండేబల్లూరులో దాదాపు100 ఎకరాలు, కల్లాలిలో 30 ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు.
Farmers | ప్రభుత్వం ఆదుకోవాలి

-ప్రదీప్ పటేల్, రైతు
అకాల వర్షంతో ఆరబోసిన మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.