అక్షరటుడే, వెబ్డెస్క్ : Rains | తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి అకాల వర్షాలు rains in Telangana బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడటంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు(Farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతకు వచ్చిన వరి పంట(Paddy Crop) పలు చోట్ల నేలకొరిగింది. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. వడగాళ్ల వర్షానికి వడ్లు నేలరాలాయి. ఈదురు గాలులకు మామిడికాయలు కిందపడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వర్షం పడింది. రాత్రి కూడా ఆయా జిల్లాల్లో మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని ప్రకటించింది.