Bihar rains | వాన బీభత్సం.. పిడుగుపాట్లకు 13 మంది మృతి

Bihar rains | అకాల వర్షం బీభత్సం.. పిడుగుపాటుకు 13 మంది మృతి
Bihar rains | అకాల వర్షం బీభత్సం.. పిడుగుపాటుకు 13 మంది మృతి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:  Bihar rains | బీహార్​లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. బుధవారం అక్కడి నాలుగు జిల్లాల్లో పిడుగులు పడి 13 మంది మరణించారని బీహార్​ ముఖ్యమంత్రి కార్యాలయం Bihar Chief Minister’s Office వెల్లడించింది.

Advertisement

బెగుసరాయ్ జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మరణించారని తెలిపింది. దర్భంగాలో Darbhanga నలుగురు, మధుబనిలో Madhubani ముగ్గురు, సమస్తిపూర్‌లో Samastipur ఒకరు మరణించినట్లు వివరించింది. మధుబని జిల్లాలో తండ్రి, కూతురు సహా ముగ్గురు మరణించారు. దర్భాంగాలో పిడుగుపాటుకు ఒక వృద్ధుడు చనిపోయాడు.

ఉదయం కురిసిన భారీ తుఫాను, వర్షం, వడగళ్ల వాన ఉత్తర బీహార్‌లోని North Bihar మధుబని, బెగుసరాయ్, దర్భంగా జిల్లాల్లో భారీ విధ్వంసం సృష్టించిందని అక్కడి స్థానిక మీడియా Local media వెల్లడించింది.

పిడుగుపాటుతో 13 మంది మరణించడంపై బీహార్​ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ Bihar Chief Minister Nitish Kumar తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Advertisement