Wedding : పెళ్లిలో చెప్పుల గొడ‌వ‌.. చివ‌రికి పెళ్లి కొడుకే తన్నులు తినాల్సి వ‌చ్చిందిగా..!

అక్షరటుడే, వెబ్ డెస్క్: Wedding : సోష‌ల్ మీడియాలో (Social Media) నిత్యం కొన్ని వంద‌ల కొద్ది వార్త‌లు హ‌ల్‌చల్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఇందులో కొన్ని వార్త‌లు పెళ్లికి సంబంధించి ఉంటాయి. ఏదో ఒక పెళ్లి వార్త అంద‌రి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా ఓ వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఉత్తరాఖండ్‌కు చెందిన యువకుడికి (Uttar Pradesh) యూపీలోని బిజ్నోర్ జిల్లాకు చెందిన యువతితో ఇటీవ‌ల‌ పెళ్లైంది. పెళ్లి తర్వాత ఆచారాల ప్రకారం వధువు కుటుంబ సభ్యులు వరుడి చెప్పులు దాచే ఆచారం మ‌నం త‌ర‌త‌రాలుగా చూస్తూ ఉన్నాం. దాచ్చిపెట్టిన చెప్పులు తిరిగి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు వధువు బంధువులు.

Advertisement

Wedding : ఏంటి ఇది..

అస‌లు వివాదం అక్క‌డ మొద‌లైంది. వివాదం పీక్స్‌కి చేరుకోవ‌డంతో వరుడికి చుక్కలు చూపించారు వధువు బంధువులు. ఇరువర్గాల మధ్య మొదలైన వాదన పెద్ద గొడవకు దారితీసింది.. వధువు తరపు వారు తమను ఒక గదిలో బంధించి కొట్టారని వరుడు, అతని బంధువులు చెబుతున్నారు. పరిస్థితి ఎంతగా తీవ్రంగా మారిందంటే పరస్పరం కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది. వధూవరుల కుటుంబాల మధ్య చిన్న విషయంలో మొదలైన వివాదం తీవ్ర గొడవకు fighting దారితీసింది. అయితే వ‌రుడి చెప్పులు దాచిపెట్టి క‌ట్నంగా 50వేల రూపాయ‌లు డిమాండ్ చేయ‌డంతో అప్పుడు త‌న ద‌గ్గ‌ర ఉన్న 5 వేల రూపాయ‌లు ఇచ్చాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  Reels | గంగా నదిలో రీల్స్​.. నీటిలో కొట్టుకుపోయిన యువతి

అప్పుడు కోపోద్రిక్తులైన వధువు బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. అతడితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువైపుల బంధువులకు ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో వరుడిని ఓ గదిలో బంధించి వధువు తరఫు బంధువులు కర్రలతో చితకొట్టారని తెలిసింది. చివరకు పోలీసులు Police రావడంతో గొడవ సద్దుమణిగింది. ఆ వరుడు ముహమ్మద్ షబీర్‌గా గుర్తించారు. అయితే షబీర్ కుటుంబం ఇచ్చిన బంగారం నాణ్యత గురించి వ‌ధువు కుటుంబం తమను ప్రశ్నించిందని , అది వారికి కోపం తెప్పించిందని, దాంతో పరిస్థితులు దారుణంగా మారాయని అన్నారు.. తరువాత నజీబాబాద్ పోలీసు బృందం రంగంలోకి దిగటంతో పరిస్థితి సద్దుమణిగింది. పోలీసులు ప్రతి ఒక్కరి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు.

Advertisement