అక్షరటుడే, కామారెడ్డి: తలసేమియా సికిల్ సెల్ పురస్కారాన్ని తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అందుకున్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, కామారెడ్డి రక్తదాతల ఆధ్వర్యంలో 2023, 24లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 3,500 యూనిట్లకు పైగా రక్తాన్ని అందజేసినందుకు ఈ పురస్కారం దక్కింది. హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ బాలు తదితరులు పాల్గొన్నారు.