అక్షరటుడే, ఇందూరు: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే హైదరాబాద్ నుంచి మూసీ పరివాహక పాదయాత్ర చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఇళ్లు కూల్చి నల్గొండ నుంచి పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజైనా రాష్ట్ర ప్రజలకు గుర్తిండి పోయే పని చేస్తారని భావిస్తే మూసీ పాదయాత్ర పేరుతో మోసం చేస్తున్నారని విమర్శించారు. పేదల ఇళ్లను కూల్చితే చెప్పులతో చీపుర్లతో స్వాగతం పలుకుతారో.. పూలతో స్వాగతం పలుకుతారో ప్రభుత్వానికి తెలుస్తుందని పేర్కొన్నారు.