అక్షరటుడే, ఇందూరు : పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. తపస్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చౌక్ వద్ద చేపట్టిన శాంతియుత దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల 4 డీఏలు, ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. అలాగే పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి, బద్రీనాథ్, సుదర్శన్, జిల్లా, ఆయా మండల బాధ్యులు పాల్గొన్నారు. అలాగే నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి: ధన్‌పాల్
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement