అక్షరటుడే, ఇందూరు: నగర అభివృద్ధికి ఉపయోగపడే సీడీపీ నిధులు విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అప్పటినుంచి నిధులు విడుదల చేయలేదన్నారు. ఇకనైనా టీయూ ఎఫ్ఐడీసీ, సీడీపీ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.