అక్షరటుడే, ఇందూరు : నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలని, ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలన్నారు. మంత్రి మండలిలో చేసిన తీర్మానం మేరకు మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, హ్యాండ్లూమ్స్ సంస్థకు కొండా లక్ష్మణ్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. హైదరాబాద్ ను భాగ్యనగర్ గా, ఆదిలాబాద్ ను ఎదులాపూరంగా, మహబూబ్ నగర్ ను పాలమూరుగా, వరంగల్ ను ఓరుగల్లుగా మార్చాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, పోతన్ కర్ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ మల్లేష్ యాదవ్, నాయకులు పల్నాటి కార్తీక్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలి
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement