అక్షరటుడే, ఇందూరు: నగరంలోని గుంతల రోడ్లను బాగు చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఆదేశించారు. మంగళవారం ఆర్అండ్ బీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడ రోడ్లు వేసినా.. నాణ్యతతో వేయాలన్నారు. నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు మరమ్మతులు చేయించి, అర్హులైన పేదలకు అందించాలన్నారు. పాత కలెక్టరేట్ మైదానంలో స్పోర్ట్స్ ట్రాక్, ప్రభుత్వ స్థలాల్లో మినీ స్టేడియాలను నిర్మించాలని సూచించారు. ఎక్కడైనా మరమ్మతుల కోసం రోడ్లు తవ్వితే వెంటనే పూడ్చివేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ హనుమంతరావు, ఈఈ మురళి, డీఈఈ ప్రవీణ్, ఏఈ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.