అక్షరటుడే, ఇందూరు: కళలు మానవ వికాసానికి కీలకమని, కళా ప్రదర్శన సమాజంలో శాంతిని స్థాపిస్తాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. మంగళవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అందెల రవళి నాట్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నాట్యగురు సాయి రవళి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రసిద్ధ నర్తకి వెంపటి ప్రియాంక, సంగీత పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ రాజు, కూచిపూడి విభాగం అధిపతి దేవులపల్లి ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు వెనిగళ్ల సురేష్, రమణాచారి, అనంత నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.