అక్షరటుడే, ఇందూరు: వసతి గృహ విద్యార్థులకు చెల్లించే మెస్ ఛార్జీల్లో సగం వాటా కేంద్ర ప్రభుత్వానిదేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శనివారం న్యాల్ కల్ రోడ్డులోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని అడిషనల్ కలెక్టర్ అంకిత్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డైట్ ఛార్జీలు 40 శాతం పెంచడం అభినందనీమన్నారు. అయితే ప్రస్తుత నిత్యావసర ధరలకు అనుగుణంగా ఇంకో 20శాతం పెంచే ఆలోచన చేయాలని కోరారు. అలాగే తన ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో బుక్స్ అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.