అక్షరటుడే ఇందూరు: ప్రధాని నరేంద్ర మోదీ విశ్వ గురువు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా.. ఆదివారం నగరంలోని బురుడుగల్లీలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశం మొత్తం ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలను మహాయజ్ఞంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఖిల్లా రామ్ మందిర్ మండలాధ్యక్షుడు వీరేందర్, 51వ డివిజన్ నాయకులు భగత్, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.