అక్షరటుడే, ఇందూరు: వాల్మీకి రాసిన రామాయణం.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శమని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ భవన్లో నిర్వహించిన వాల్మీకి జయంతి ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శివప్రసాద్, నాయకులు లక్ష్మీనారాయణ, సంజు, సాయినాథ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.