అక్షరటుడే, ఇందూరు: నగరం పరిశుభ్రంగా ఉండాలంటే కార్పొరేషన్ సిబ్బంది పాత్ర కీలకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. స్వచ్ఛతా హీ సేవా ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని 15 రోజులపాటు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించామన్నారు. నగరంలోని సిబ్బంది ఎంతో శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. 15 రోజులపాటు కొనసాగిన మహా యజ్ఞంలో అందరూ పాలుపంచుకోవడం సంతోషకరమన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మకరంద్ మాట్లాడుతూ.. స్వచ్ఛత హీ సేవా స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మేయర్ నీతూకిరణ్, డిప్యూటీ కమిషనర్ రాజేంద్రప్రసాద్, కార్పొరేటర్లు, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad MP | మాధవ​నగర్​లో పర్యటించిన ఎంపీ అర్వింద్​