అక్షరటుడే, ఇందూరు: నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని, వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం నగరంలోని 50 డివిజన్లో సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనరల్ ఫండ్ కింద ప్రతి డివిజన్‌కు రూ.10 లక్షలు మంజూరయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాను మొదటిసారి సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లానని గుర్తు చేశారు. కార్యక్రమంలో మేయర్ నీతూకిరణ్, కార్పొరేటర్ బట్టు రాఘవేందర్, కాలనీవాసులు పాల్గొన్నారు.