అక్షరటుడే, ఇందూరు : ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా సూచించారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని హెచ్‌ఎంను ఆదేశించారు. సుమారు 600 మంది విద్యార్థులకు కేవలం నాలుగు మూత్రశాలలు ఉండడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక గదుల్లో విద్యుత్‌ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడాన్ని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎంఈవో సాయా రెడ్డి, బీజేపీ నాయకులు పాఠశాల సిబ్బంది ఉన్నారు.