అక్షరటుడే, ఇందూరు: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. సోమవారం బీజేపీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఢిల్లీలో ఎగిరిన కాషాయ జెండా గల్లీలో ఎగిరే వరకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. ప్రశ్నించే గొంతుకలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్యను గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ ఇందూరు శాఖ ఇన్ఛార్జి కొండ ఆశన్న, నారాయణ యాదవ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడాలి
Advertisement
Advertisement