అక్షరటుడే, ఇందూరు : కులగణనలో సర్వేలో ఆస్తుల వివరాలెందుకు ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్వే కూడా వివిధ పథకాల్లో కోతలు పెట్టేందుకే అనే అనుమానం వస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు నమ్మకం కోల్పోయారన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో స్కాంలు, కమీషన్ల గొడవలే తప్ప అభివృద్ధిని పూర్తిగా మరిచిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆస్తులు, జీత భత్యాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.