అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Trump Tariff | అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం america chaina trade war మరింత ముదురుతోంది. పరస్పర సుంకాల విధింపుతో రెండు దేశాలు ఏమాత్రం వెనక్క తగ్గడం లేదు.
ఇప్పటికే చైనాపై అమెరికా 145 శాతం టారిఫ్‌లు విధించగా, డ్రాగన్(Dragon) కూడా అదే స్థాయిలో ప్రతి స్పందించింది. 125 శాతం సుంకాల పెంపుతో పాటు అరుదైన ఖనిజాల ఎగుమతిని నిలిపివేసింది. దీంతో ఆగ్రహానికి గురైన అగ్రరాజ్యం చైనాపై మరోమారు టారిఫ్‌లు(Tarrif) పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 145 శాతం సుంకాలను 245 శాతం పెంచుతున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. డ్రాగన్ ప్రతీకార చర్యల కారణంగా ఆ దేశం 245 శాతం సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.
Trump Tariff | వెనక్కు తగ్గని అగ్ర రాజ్యాలు..
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వాణిజ్య యుద్ధానికి తెర తీశారు. ప్రపంచ దేశాలు అధిక సుంకాలతో తమను దోచుకుంటున్నాయని పేర్కొంటూ భారత్, చైనా సహా అన్ని దేశాలపై టారిఫ్‌లు పెంచారు. ఇండియాపై 26 శాతం, చైనాపై 34 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అమెరికా చర్యలపై తీవ్రంగా స్పందించిన డ్రాగన్ తాను కూడా టారిఫ్‌లు పెంచుతున్నట్లు తెలిపింది.
దీంతో అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య పోరు రోజురోజుకు ముదురుతోంది. చైనా(China) ప్రతీఘటనపై ఆగ్రహానికి గురైన ట్రంప్.. 145 శాతం సుంకాలు పెంచుకుంటూ పోయారు. అయినా వెనక్కు తగ్గని డ్రాగన్ యూఎస్ నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపైనా 125 శాతం టారిఫ్‌లు విధించింది. అంతేకాదు, అమెరికా అత్యధికంగా దిగుమతి చేసుకునే అరుదైన ఖనిజాల సరఫరాను నిలిపివేసింది. అంతేకాదు, అమెరికాకు చెందిన బోయింగ్ విమానాల boing flights డెలివరీ తీసుకోవద్దని తన విమానయాన సంస్థలను(Airlines) ఆదేశించింది.
Trump Tariff | చర్చలంటూనే టారిఫ్‌ల పెంపుపై పరిశీలన..
చిప్‌లు, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వినియోగించే అరుదైన ఖనిజాల ఎగుమతులను చైనా నిలిపి వేయడంతో అమెరికాలోని ఆయా కంపెనీల్లో ఆందోళన మొదలైంది. ఇది యూఎస్ (US)అభివృద్ధికి శరాఘాతంగా మారుతుందన్న ఆందోళనల నేపథ్యంలో చైనాతో చర్చలు జరిపేందుకు ట్రంప్ వర్గం యోచిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
త్వరలోనే డ్రాగన్(Dragon)తో అతిపెద్ద డీల్ జరిగే అవకాశముందని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ఇది జరిగిన తర్వాతి రోజే, చైనా చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వైట్‌హౌస్(White House) పేర్కొంది. డ్రాగన్ ప్రతీకార చర్యలు ఆపకపోతే 245 శాతం సుంకాలు పెంచుతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా సిరంజీలు, సూదులు, అల్యూమీనియం, తదితర వస్తువులపై ఈ పెంపు ఉండొచ్చని అమెరికా మీడియా సంస్థలు వెల్లడించాయి.