అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ తాము ఒప్పందాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. కానీ ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తామని ఆయన హెచ్చరించారు. కాగా ఈ ఒప్పందంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోనున్నాయి.