US Tornado | అమెరికాపై విరుచుకుపడిన టోర్నడోలు..

US Tornado | అమెరికాపై విరుచుకుపడిన టోర్నడోలు..
US Tornado | అమెరికాపై విరుచుకుపడిన టోర్నడోలు..
Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US Tornado : అగ్ర రాజ్యం అమెరికా (USA)పై పెను తుపాను విరుచుకుపడింది. పెద్ద ఎత్తున టోర్నడోలు చుట్టుముట్టాయి. దుమ్ముధూళితో కూడిన బలమైన గాలులు వీయడంతో ఆయా రాష్ట్రాల్లో 100కుపైగా కార్చిచ్చులు చెలరేగాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్క మిస్సోరీలోనే ఇప్పటివరకు పది మంది మృతి చెందినట్లు అధికారుల అంచనా. టెక్సాస్ పాన్హ్యాండిల్లోని అమరిల్లో కౌంటీలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఆర్కన్సాస్ లోనూ ముగ్గురు చనిపోయారు. మరో 29 మంది గాయపడ్డారు.

Advertisement
US Tornado | అమెరికాపై విరుచుకుపడిన టోర్నడోలు..
US Tornado | అమెరికాపై విరుచుకుపడిన టోర్నడోలు..

US Tornado : చెలరేగిన కార్చిచ్చు..

మిస్సోరీ(Missouri)లో టోర్నడోలు బెంబేలెత్తించాయి. వీటి వల్ల పలు భవనాలు దెబ్బతిన్నాయి. అలబామా, మిసిసిపీ, కెంటకీ, టెనసీ, ఇండియానా, ఇల్లినోయిస్, టెక్సాస్, టెన్నెసీ(Alabama, Mississippi, Kentucky, Tennessee, Indiana, Illinois, Texas, Tennessee) రాష్ట్రాలకూ టోర్నడోల ముప్పు పొంచి ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం(National Weather Service) ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఓక్లహోమా, న్యూ మెక్సికో, టెక్సాస్, మిస్సోరీ, కాన్సస్ల(Oklahoma, New Mexico, Texas, Missouri, Kansas)లో కార్చిచ్చులు చెలరేగాయి. దీంతో ఆయా ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని నివాసితులకు జాతీయ వాతావరణ సేవల విభాగం సూచించింది.

ఇది కూడా చ‌ద‌వండి :  US Trump | అమెరికా అంటే కాంప్లెక్స్.. ట్రంప్​ అంటే సుప్రీం!
US Tornado | అమెరికాపై విరుచుకుపడిన టోర్నడోలు..
US Tornado | అమెరికాపై విరుచుకుపడిన టోర్నడోలు..

US Tornado : ఉత్తరం నుంచి బలమైన గాలులు..

కెనడా సరిహద్దు నుంచి టెక్సాస్ వరకు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్పష్టం చేసింది.