అక్షరటుడే, వెబ్డెస్క్: US Visa | సమ్మర్ వెకెషన్ ఎంజాయ్ చేయడానికి అమెరికా america tour వెళ్లాలని ఓ యువకుడు ప్లాన్ చేసుకున్నాడు. తీరా అంతా పూర్తయ్యాక అధికారులు చేసిన చర్యతో కంగుతిన్నాడు.
అమెరికా వీసా america visa కోసం ఓ యువకుడు అప్లై చేశాడు. వీసా ఇంటర్వ్యూకు వెళ్లాక వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాడు. అయితే 40 సెకన్లలోనే ఆయన వీసా visa రిజెక్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి సదరు యువకుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
తాను రెండు వారాల వెకేషన్ కోసం ఫ్లోరిడా florida వెళ్లడానికి వీసా కోసం అప్లై చేశానన్నారు. ఇంటర్వ్యూలో తనను మూడు ప్రశ్నలు మాత్రమే అడిగారని చెప్పాడు. అందులో ఒకటి గర్ల్ ఫ్రెండ్ girl friend ఉందా అని అడగ్గా.. “ఉందని ఆమెను కలుస్తానని” చెప్పానన్నారు. దీంతో 40 సెకన్ల పాటే ఇంటర్వ్యూ పూర్తి చేసి వీసా రిజెక్ట్ చేశారని సదరు యువకుడు వాపోయాడు.