అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండలం జలాల్ పూర్ గ్రామానికి చెందిన వడ్డే వెంకన్న(54) పొలానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి మృతి చెందాడు. వర్ని ఎస్సై కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వర్షం, ఈదురు గాలులకు గ్రామ శివారులో విద్యుత్ తీగలు తెగి పొలంలో పడిపోయాయి. రైతు గురువారం సాయంత్రం పొలానికి వెళ్తుండగా గమనించక తీగలకు తగలడంతో విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.