అక్షరటుడే, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. కొద్దికాలంగా పార్టీలో ఎమ్మెల్యే మదన్ మోహన్, సుభాష్ రెడ్డి మధ్య వర్గపోరు సాగుతున్న విషయం తెలిసిందే. దీంతో వడ్డేపల్లిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. సంజాయిషీ ఇవ్వాలని నవంబర్ 21న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సుభాష్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అదే నెల 29న ఆయన వివరణ ఇచ్చారు. అయితే ఆ వివరణతో సంతృప్తి చెందని క్రమశిక్షణ సంఘం సుభాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మదన్ మోహన్ రావుకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడంతో సుభాష్ రెడ్డి అప్పట్లో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన సుభాష్ రెడ్డి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరగా.. తాజాగా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.
వడ్డేపల్లి సుభాష్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Advertisement
Advertisement