Vallabhaneni Vamshi | వల్లభనేని వంశీకి షాక్​.. రిమాండ్​ పొడిగింపు

Vamshi | వల్లభనేని వంశీకి షాక్​.. రిమాండ్​ పొడిగింపు
Vamshi | వల్లభనేని వంశీకి షాక్​.. రిమాండ్​ పొడిగింపు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Vamshi | వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు షాక్​ ఇచ్చింది. ఆయన రిమాండ్​ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు చెప్పింది. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్​ ముగియడంతో జూమ్​ యాప్​ ద్వారా న్యాయమూర్తి విచారించారు. వల్లభనేని వంశీని హైదరాబాద్​లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీని అరెస్ట్ చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీకి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వంశీని జిల్లా జైలుకు తరలించారు.

Vallabhaneni Vamshi | కస్టడీకి ఇవ్వని కోర్టు

రిమాండ్​ ముగియడంతో బెయిల్​ కోసం వంశీ పిటిషన్​ దాఖలు చేశారు. న్యాయమూర్తి ఆయన పిటిషన్​ను తోసిపుచ్చి ఈ నెల 25 వరకు రిమాండ్​ పొడిగించారు. అదే సమయంలో వంశీని తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్​ న్యాయమూర్తి తిరస్కరించారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. అలాగే తన బ్యారక్​ మార్చాలని వంశీ పిటిషన్ వేయగా.. భద్రత కారణాల రిత్యా మార్చడం కుదరదని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Good News : మీరు ఇల్లు క‌ట్టుకోవాల‌ని అనుకుంటున్నారా.. అయితే మీకు ఒక శుభ‌వార్త‌

Vallabhaneni Vamshi | సిట్​ ఏర్పాటు

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం గతంలోనే సిట్​ ఏర్పాటు చేసింది. అక్రమ మైనింగ్​తో సహా భూ కబ్జాలపై విచారణకు నలుగురితో కూడిన బృందాన్ని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ బృందానికి జీవీజీ అశోక్​ నేతృత్వం వహిస్తున్నారు.

Advertisement