అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామ దేవతల వద్ద హలాల్ ను నిషేధిస్తున్నామని వీడీసీ అధ్యక్షులు బార్ల ముత్యం పేర్కొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఎవరైనా హలాల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి విక్రయాలను కూడా అరికడతామన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు నవనీత్, సంతోష్, గంగారెడ్డి, దుమ్మాజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.