Advertisement
అక్షరటుడే, బోధన్: మండలంలోని కల్దుర్కి గ్రామంలో వీరభద్ర మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చిన మల్ల యోధులు పోటీల్లో తలపడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
Advertisement