అక్షరటుడే, జుక్కల్ : కాటేపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఎంపీని నారాయణఖేడ్ లోని ఆయన స్వగృహంలో కలిశారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు విన్నవించారు. ఆయన స్పందిస్తూ గ్రామ అభివృద్ధికి అన్నివేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొహియుద్దీన్, మల్లప్ప పటేల్, మొగులాగౌడ్, గంగాగౌడ్, విఠల్, క్రాంతికుమార్, హన్మాండ్లు, సాయిలు, రవి, రాంచందర్ పాల్గొన్నారు.