అక్షరటుడే, గాంధారి: Gandhari | కొబ్బరి బొండాలు తరలిస్తున్న టాటాఏస్ వాహనం(Tata Ace vehicle) బోల్తాపడిన ఘటన సదాశివనగర్(Sadashivnagar) మండలం మర్కల్ శివారులో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజమండ్రి నుంచి నిజామాబాద్ వైపుగా కొబ్బరి బొండాలతో వెళ్తున్న టాటాఏస్ వాహనం(Tata Ace vehicle) టైర్ పగిలిపోవడంతో బోల్తాకొట్టింది. రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అరగంట పాటు అంతరాయం ఏర్పడింది. పోలీసులు(Police) వచ్చి జేసీబీ(JCB) సాయంతో వాహనాన్ని పక్కకు తప్పించారు. కాగా.. వాహనంలో ఉన్న డ్రైవర్(Driver) సహా మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Gandhari | కొబ్బరి బొండాలు తరలిస్తున్న వాహనం బోల్తా
Advertisement
Advertisement