అక్షరటుడే, కామారెడ్డి : కుల వృత్తిదారులకు ప్రభుత్వం ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం బీసీ కార్పొరేషన్ అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. అర్హులైన చేతి వృత్తిదారులకు మూడెకరాల భూమి, ప్రతి వృత్తి దారుడికి రూ.5వేల ఆసరా పెన్షన్, వృత్తి రక్షణ కోసం వడ్డీ లేని రుణాలివ్వాలని డిమాండ్ చేశారు.