అక్షరటుడే, భిక్కనూరు: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను వెంటనే ప్రారంభించాలని అంతంపల్లి సింగిల్ విండో ఛైర్మన్ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం అంతంపల్లి, లక్ష్మీ దేవునిపల్లి గ్రామాల్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కాంటాలు ప్రారంభించకుండా కాలయాపన చేస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు వానలు కురుస్తుండడంతో ధాన్యం తడుస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాంటాలను ప్రారంభించాలని కోరారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement