Venkatesh : సురేందర్ రెడ్డితో వెంకటేష్ కాంబో ఫిక్స్ అయితే రచ్చ రచ్చే..!

Venkatesh : సురేందర్ రెడ్డితో వెంకటేష్ కాంబో ఫిక్స్ అయితే రచ్చ రచ్చే..!
Venkatesh : సురేందర్ రెడ్డితో వెంకటేష్ కాంబో ఫిక్స్ అయితే రచ్చ రచ్చే..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Venkatesh : ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాల్లో వెంకటేష్ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు వెంకీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ గా 300 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో సూపర్ జోష్ లో ఉన్న వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా కథా చర్చలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏజెంట్ డైరెక్టర్ అదే సురేందర్ రెడ్డితో స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నారని తెలుస్తుంది. అక్కినేని హీరో అఖిల్ తో ఏజెంట్ సినిమా చేసిన సురేందర్ రెడ్డి రెండేళ్ల నుంచి ఎలాంటి ఆఫర్లు లేక ఖాళీగా ఉన్నాడు. ఫైనల్ గా సూరికి వెంకీ మామ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Venkatesh : యాక్షన్ ప్రాధాన్యతతో..

సురేందర్ రెడ్డి సినిమాలన్నీ కూడా యాక్షన్ ప్రాధాన్యతతో వస్తాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ తో వెంకటేష్ ఇక మీదట తాను కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే చేయాలని అనుకుంటున్నాడు. మరి సురేందర్ రెడ్డి వెంకటేష్ పంథాలో సినిమా చేస్తాడా లేదా డైరక్టర్ మాస్ పంథాలోకి వెంకటేష్ వెళ్తాడా అన్నది చూడాలి. వెంకటేష్ సురేందర్ రెడ్డి కాంబో సినిమా తప్పకుండా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి :  Venkatesh : వెంకటేష్ ది ఏమి లేదు అంతా సురేష్ బాబు చేతుల్లోనే.. యువ రచయిత సంచలన కామెంట్స్..!

సురేందర్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నారు. ఆ సినిమా రాం తాళ్లూరి నిర్మించనున్నారు.సురేందర్ రెడ్డి తనకు వచ్చిన ఈ ఛాన్స్ ని అన్ని విధాలుగా వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే సినిమా స్క్రిప్ట్ దశ నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. వెంకటేష్, పవన్ కళ్యాణ్ సినిమాలు పడితే మాత్రం సురేందర్ రెడ్డి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Advertisement