BANSWADA | వైభవంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం
BANSWADA | వైభవంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం
Advertisement

అక్షరటుడే, బాన్సువాడ : BANSWADA | బీర్కూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుపతి దేవస్థానంలో ల‌క్ష్మీగోదాదేవి స‌హిత శ్రీనివాసుని క‌ళ్యాణం అంగ‌రంగం వైభ‌వంగా జ‌రిగింది. శుక్ర‌వారం ధ‌ర్మ‌క‌ర్త‌లైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంప‌తులు ప‌ట్టు వస్త్రాలు సమర్పించారు. లక్ష్మీ భూదేవి సతీ సమేతంగా శ్రీవారు హనుమాన్ వాహనంపై మాడవీధుల్లో ఊరేగారు.

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వయంగా రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగారు. చిత్తూరు జిల్లా తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవం లాగా ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కళ్యాణ పెద్దలుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు, పోచారం శంభు రెడ్డి, సోనీరెడ్డి, రాధిక రెడ్డి పాల్గొన్నారు.

Advertisement