Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఎన్ఎస్ యూఐ(NSUI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వరదబట్టు వేణురాజ్ నియామితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర కమిటీలో చోటు కల్పించడంపై రాష్ట్ర ఇన్చార్జీలు మహమ్మద్ ఫహద్, ప్రతీక్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఎస్ యూఐ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని వేణురాజ్ పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన తనకు అన్నివిధాల సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement