
అక్షర టుడే, వెబ్ డెస్క్ Venu Yeldandi : కమెడియన్‌గా అలరించిన వేణు (Venu Yeldandi) నుంచి బలగం లాంటి ఎమోషనల్ మూవీ వస్తుందని ఎవరు ఊహించలేదు. అసలు అతను డైరెక్టర్ అంటేనే అందరిలానే ఏదో చేస్తాడులే అనుకుంటే బలగం అంటూ ఒక అద్భుతమైన సినిమా చేశాడు. ఆ సినిమాతో కమెడియన్ గా ఉన్న వేణు కాస్త డైరెక్టర్ గా రెస్పెక్ట్ ని తెచ్చుకున్నాడు. ఐతే బలగం వచ్చి రెండేళ్లు దాటింది. (Venu Yeldandi) వేణు నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ (Yellamma) పనులు జరుగుతున్నాయి.
బలగం లాంటి బంపర్ హిట్ అందుకున్న వేణు నెక్స్ట్ సినిమా (Venu next movie) ఎల్లమ్మ (Yellamma) కోసం ఫ్రీ హ్యాండ్ వచ్చేలా చేసుకున్నాడు. దిల్ రాజు ఎల్లమ్మ (Yellamma) కోసం మంచి బడ్జెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నితిన్(Nithin) హీరోగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. సాయి పల్లవి కోసం ట్రై చేస్తున్నారు కానీ ఆమె డేట్స్ కష్టమే అని తెలుస్తుంది.
Venu Yeldandi : స్టార్ కాస్ట్‌ని ఎంపిక చేసే పనుల్లో..
నితిన్(Nithin) వేణు కాంబోలో రాబోతున్న ఎల్లమ్మ(Yellamma)లో కీర్తి సురేష్‌ను (Keerthy Suresh) ఎంపిక చేశారని టాక్. ఇదిలాఉంటే ఎల్లమ్మ కోసం వేణు మిగతా స్టార్ కాస్ట్‌ని ఎంపిక చేసే పనుల్లో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. ఎల్లమ్మ కూడా తెలంగాణా బ్యాక్ డ్రాప్ కథతో వస్తుందని తెలుస్తుంది. అదుకే తెలంగాణలోని పలుచోట్ల వేణు స్టేజ్ ఆర్టిస్టుల కోసం వేట మొదలు పెట్టాడని అంటున్నారు. ముఖ్యంగా సిరిసిల్ల, నిజామాబాద్ ప్రాంతాల్లో స్టేజ్ ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నాడని తెలుస్తుంది.
బలగం సినిమాలో కూడా కొత్త వారితోనే మెప్పించాడు వేణు. మరోసారి ఎల్లమ్మ కోసం స్టేజ్ ఆర్టిస్టులను ఎంపిక చేస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఎల్లమ్మ సినిమా (Yellamma Movie) సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా గురించి నితిన్ కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో క్రేజీ కామెంట్స్ చేశాడు. ఆ సినిమాలో తాను ఎంత బాగా నటిస్తే అంత గొప్ప పేరొస్తుందని అన్నాడు నితిన్. సో ఎల్లమ్మ (Yellamma) కోసం వేణు మరో భారీ ప్లానింగ్‌తోనే రంగమోకి దిగుతున్నాడని చెప్పొచ్చు.