Dilsukhnagar Bomb Blast | దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నేడే తీర్పు

Dilsukhnagar bomb blast | దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నేడే తీర్పు
Dilsukhnagar bomb blast | దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నేడే తీర్పు

అక్షరటుడే, హైదరాబాద్: Dilsukhnagar bomb blast | దిల్సుఖ్నగర్​లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన  బాంబు పేలుళ్ల (Dilsukhnagar bomb blast) ఘటనలో 18 మంది మృతి చెందగా.. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన దేశంలో సంచలన రేపింది. ఉగ్రవాదులు terrorists టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి భారీ విధ్వంసం సృష్టించారు.

Advertisement

ఈ బాంబు పేలుడు bomb blast కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడుగా యాసిన్‌ భత్కల్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. దర్యాప్తు సందర్భంగా 157 మంది సాక్షులను ఎన్‌ఐఏ విచారించింది. తుది నివేదిక మేరకు యాసిన్‌ భత్కల్‌ సహా ఐదుగురికి 2016లో ఎన్‌ఐఏ కోర్టుNIA court ఉరిశిక్ష విధించింది.

ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టు High Court ను ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. హైకోర్టులో ఇప్పటికే ఈ కేసులో వాదనలు ముగిశాయి. ఈ బాంబు విధ్వంసం కేసులో హైకోర్టు నేడు తీర్పు ప్రకటించనుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  BJP MP Ravi Shankar | కాంగ్రెస్ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టిన బీజేపీ

దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో ఫిబ్రవరి 21, 2013న కొద్ది నిమిషాల వ్యవధిలోనే రెండు పేలుళ్లు సంభవించాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలింది. తర్వాత కొద్దిసేపటికే 150 మీటర్ల దూరంలో మరో పేలుడు చోటుచేసుకుంది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి.. టెర్రరిస్టులు terrorists ఈ దాడి చేశారు. ఇండియన్ ముజాహిద్దీన్ Indian Mujahideen ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌, జియా-ఉర్‌-రెహమాన్‌, అసదుల్లా అక్తర్‌, తెహసీన్‌ అక్తర్‌, అజాజ్‌ షేక్‌ కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ నివేదించింది.

Advertisement