అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కోర్టును కోరారు. ఇటీవల మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల నాగార్జున పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. కాగా.. మంగళవారం ఈ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. పలువురి స్టేట్మెంట్ రికార్డును నమోదు చేసింది. నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య కోర్టుకు నేరుగా హాజరయ్యారు. కాగా.. తదుపరి విచారణ ఈ నెల10కి వాయిదా పడింది.