అక్షరటుడే, నిజాంసాగర్: మండలంలోని ఆరేపల్లిలో పశు వైద్యాధికారులు పశుగణన సర్వే చేపట్టారు. మండల పశు వైద్యాధికారి యూనుస్ మాట్లాడుతూ ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని అన్ని గ్రామాల్లో పశుగణన సర్వే చేపడుతున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు పశువుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట గోపాలమిత్రలు సిద్దు, రఘు, శ్రీనివాస్, తదితరులున్నారు.