అక్షరటుడే, వెబ్డెస్క్ : Vice President | న్యాయ వ్యవస్థపై ఉపరాష్ట్రపతి Vice President జగదీప్ ధన్‌ఖడ్ Jagdeep Dhankhad సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జీలకు బాధ్యత లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల తమిళనాడు గవర్నర్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం కేసులో సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులను ఎక్కువ కాలం ఆపే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు లేదని సుప్రీం వ్యాఖ్యానించింది.
మూడు నెలల్లోపు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ అంశంపై ఉపరాష్ట్రపతి స్పందించారు. కోర్టులు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి మనకు ఉండదని అన్నారు. సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రజాస్వామ్య శక్తులపై అణ్వాయుధ క్షిపణిగా మారిందని ఆయన పేర్కొన్నారు.