అక్షరటుడే, ఇందూరు: యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన విక్కీ యాదవ్‌ను ఆదివారం సన్మానించారు. నగరంలోని యాదవ సంఘం భవనంలో సత్కరించారు. కార్యక్రమంలో నగర యాదవ సంఘం అధ్యక్షుడు గుర్రం మల్లేశ్‌ యాదవ్‌, సాగర్‌ యాదవ్‌, దేవేందర్‌ యాదవ్‌, మురళి యాదవ్‌, రాజేందర్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.