అక్షరటుడే, వెబ్‌డెస్క్: Video Shooting : మహిళలు స్నానాలు చేస్తుండగా సీక్రెట్‌గా వీడియో చిత్రీకరించిచాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam district)లో చోటు చేసుకుంది.
వెస్ట్ బెంగాల్(West Bengal)కి చెందిన బిశ్వాల్ సర్కార్ కొంతకాలం క్రితం నుంచి పార్వతీపురం బొగ్గు వీధిలో నివాసముంటున్నాడు. పట్టణంలో ఉన్న ఓ ఆసుప్రతిలో ఆర్ఎంపిగా బిశ్వాల్ సర్కార్ జాయిన్ అయ్యాడు. కొన్ని నెలలుగా అక్కడే ఉద్యోగం చేస్తున్న బిశ్వాల్ ఎక్కువ సమయం ఆసుప్రతిలోనే ఉండేవాడు.
ఆసుప్రతి వెనుక వైపున దుగరాజు పేట కాలనీ ఉంది. అక్కడ నివాసమున్న స్థానికుల ఇళ్ల స్నానపు గదులకు పైన ఎలాంటి పై కప్పులు ఉండవు. ఈ క్రమంలోనే ఒకరోజు సాయంత్రం ఆసుప్రతి పైకి వెళ్లిన బిస్వాల్ ఓ స్నానం గదిలో మహిళ స్నానం చేయడాన్ని చూశాడు. వెంటనే స్నానం చేయడాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఇలా చాలా మంది మహిళల ఫొటోలు, వీడియోలు తీస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో ఒకరోజు స్నానం చేస్తున్న ఒక మహిళ.. బిశ్వాల్ చేస్తున్న వ్యవహారాన్ని గమనించింది. వెంటనే తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో, ఇరుగుపొరుగు వారిని తీసుకొని బిశ్వాల్ వద్దకు వెళ్లారు. అక్కడ బిశ్వాల్ ఒక్కడే ఉండటాన్ని గుర్తించి, నిలదీశారు.
బిశ్వాల్ సెల్ ఫోన్ లాక్కొని పరిశీలిస్తే.. చాలా మంది మహిళల ఫొటోలు, వీడియోలు చూసి కోపంతో ఊగిపోయిన మహిళలు చెప్పులతో బిశ్వాల్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.