అక్షరటుడే, వెబ్‌డెస్క్ Vijay Deverakonda : బిగ్ బాస్ సీజన్ 8 వరకు సూపర్ సక్సెస్ కాగా.. త్వరలో సీజన్ 9 ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఐతే ఈసారి బిగ్ బాస్ టీం హోస్ట్ ని మార్చబోతున్నారట. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సీజన్ 3 నుంచి కొనసాగుతున్నారు. సీజన్ 1 ఎన్టీఆర్ చేయగా.. రెండో సీజన్ నాని హోస్ట్ గా చేశాడు. ఇదిలా ఉంటే సీజన్ 9కి నాగార్జున హోస్ట్ చూడటం కష్టమే అని టాక్. ఎందుకంటే నాగార్జున సినిమా చేసే క్రమంలో బిగ్ బాస్ వల్ల ఎటు వెళ్లలేకపోతున్నాడట.
ఒకవేళ వెళ్లాల్సి వచ్చిన వీకెండ్ కల్లా అన్నపూర్ణ స్టూడియోస్ కి రావాల్సి ఉందట. అందుకే ఈసారి హోస్ట్ ని మార్చేయాలని ఫిక్స్ అయ్యారట బిగ్ బాస్ టీం. ఐతే రేసులో చాలామంది హీరోలు ఉండగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చర్చల్లో ఉన్నాడని తెలుస్తుంది. ఇదివరకు నాని హోస్ట్ గా చేయగా ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆ ఛాన్స్ అందుకోబోతున్నాడని తెలుస్తుంది.
Vijay Deverakonda : భారీ రెమ్యునరేషన్..
విజయ్ దేవరకొండ హోస్ట్ గా చేయాలంటే మాత్రం భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ హోస్ట్ గా చేయాలంటే 3 నెలలకు గాను 30 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట విజయ్ దేవరకొండ. ఇదివరకు నాగార్జునకు కూడా పాతిక కోట్ల దాకా పరితోషికం ఇచ్చారు. సో ఇప్పుడు విజయ్ వచ్చి మరో ఐదు కోట్లు అదనంగా అడుగుతున్నాడు.
బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ దేవరకొండ వస్తే మాత్రం బిగ్ బాస్ లవర్స్ కి పండగ అన్నట్టే లెక్క. ముఖ్యంగా విజయ్ మార్క్ హోస్టింగ్ టాలెంట్ చూడాలని ఉత్సాహపడుతున్నారు. ఐతే విజయ్ దేవరకొండ నిజంగానే హోస్ట్ గా చేస్తాడా లేదా అన్నది చూడాలి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. మే మూడో వారంలో ఆ సినిమా రిలీజ్ లాక్ చేశారు.