అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని విజయ్ పాఠశాల కరస్పాండెంట్ ప్రభాదేవి దర్శకత్వం వహించిన ‘హోప్ హైడ్రా’ నాటకం ఈనెల 14, 15 తేదీల్లో బెంగళూరులో నిర్వహించే దక్షిణ భారతస్థాయి పోటీలకు ఎంపికైంది. బెంగళూరు లోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ & సైన్స్ మ్యూజియంలో నిర్వహించనున్న సదరన్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్ లో ‘ గ్లోబల్ వాటర్ క్రైసిస్ – సేవ్ వాటర్’ అనే అంశంపై ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఈ నాటకానికి పాఠశాల విద్యార్థులు పి.శరన్ తేజ సహాయ దర్శకత్వం, టి.విజితేంద్రియ స్ర్కిప్ట్ రైటింగ్ అందించగా, బి.తనుశ్రీ, టి.రవిత్రేయిని, ఎ.రాజ్ కరణ్ రెడ్డి, జి.సిరి వేద, పి.రోహన్ రెడ్డి, ఎ.తరుణ్, వి.శ్రీకర్, రౌదాజహాన్ ప్రదర్శించారు.